బీజేపీ పార్టీపై విజయశాంతి సంచలన పోస్ట్‌ !

-

బీజేపీ పార్టీపై విజయశాంతి సంచలన పోస్ట్‌ పెట్టారు. 25 సంవత్సరాల నా రాజకీయ ప్రస్థానమంతా… నేను నా తెలంగాణ ఉద్యమానికి కట్టుబడి పనిచేసాను, తెలంగాణ ప్రజల మేలుకై జన్మంతా నిలబడతాను…ఇది కోట్ల మంది బిడ్డలకు తెలిసిన సత్యం అన్నారు. కానీ తనపై బీజేపీ ట్రోలింగ్‌ చేస్తుందన్నారు. 2014- 2020 7 సంవత్సరాలు కాంగ్రెస్ కేంద్ర రాష్ట్రాలలో ప్రతిపక్షంలో ఉన్నపుడు పనిచేసిన కార్యకర్తను నేను..బీజేపీకి నేను వెళ్ళటం జరిగిందా అని ప్రశ్నించారు.

vijayashanthi post on bjp party

లేక ఆ పార్టీ నేతలు, ముఖ్యులు నన్ను చేరమని అనేకసార్లు మాట్లాడి ఒప్పించి టీఆర్ఎస్ లక్షల కోట్ల అవినీతిపై చర్యలుంటాయని, తెలంగాణ సమాజానికి మేలు చేస్తామని చెప్పి మోసగించి , ఇయ్యాల తిరిగి బీఆర్ఎస్ తో కలిసిపోయినరా..? అని నిలదీశారు రాములమ్మ. నేను, వివేక్ వెంకటస్వామి గారు , రాజ్‌గోపాల్ రెడ్డి గారు అందరం ఇది తెలిసి కదా బీఆర్ఎస్ బీజేపీ ల అంతర్గత అవగాహన కూటమికి రాజీనామాలు చేసిందన్నారు. ఇంకా నా ట్విట్టర్ మాధ్యమాల్లో నన్ను విమర్శించటం బీజేపీ పేరు చెప్పుకునే కొందరి పనైతే..నన్ను అభిమానించేవారు ఆ విమర్శల పట్ల.. అట్లే నేను పరిస్థితులపైనా సమాధానం ఇయ్యాల్సి వస్తదన్నారు రాములమ్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version