BRS అంటే బేటీస్ రాబరీ స్కీం – రాములమ్మ

-

 

BRS అంటే బేటీస్ రాబరీ స్కీం అంటూ రాములమ్మ ఫైర్ అయ్యారు. దేశరాజధానిలో జరిగిన దొంగతనం వార్తలు… దేశమంతా చూస్తున్న లిక్కర్ కుంభకోణం వార్తలు… ఇదీ ఈ రోజు ఉదయం నుంచి మన తెలంగాణ చూస్తున్న వార్తల సమాహారం అన్నారు.

 

 

బీఆరెస్‌ను జాతీయ స్థాయికి ఈ లెక్క కేసీఆర్ గారు కుటుంబ సభ్యులతో కలసి తీసుకెళ్తారని… తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఈ దొరలు ఇంత గనంగా తాకట్టు పెడతరని పాపం మన అమరవీరులు ఏమాత్రం ఊహించలేదు. వారి ఆత్మలు ఎంతగా క్షోభిస్తున్నాయో…కానీ “ఇది అబద్ధం… నాకు, నా కుటుంబానికి సంబంధం లేదు అంటూ చురకలు అంటించారు.

 

 

నిజమైతే రాజీనామా చేస్తా” అని ఎందుకు చెప్పలేకపోతున్నరు కేసీఆర్ గారూ…ఈ బీఆరెస్‌తో భవిష్యత్ దేశ రాజకీయాలు ఇట్ల ఉంటయని, ప్రారంభంలోనే అవినీతి ఘనతతో చెప్పి మరీ వెళ్తున్న సందర్భం ఇది కావచ్చు. తెలుసుకోలేని అమాయకత్వమా 130 కోట్ల భారత ప్రజలది? అని ప్రశ్నించారు.ఈ దగాకోరు కేసీఆర్ సర్కారు ప్రజల్ని మోసం చేసి ఎన్ని స్కాములు చేసినా… వాటన్నిటినీ పడగొట్టి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే అతి పెద్ద స్కీమ్ ప్రజల దగ్గరుంది అని మండిపడ్డారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version