దేశవ్యాప్తంగా ఎన్నికలకు నగారా మోగింది. లోక్సభ ఎన్నికలు తెలంగాణలో మే 13వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో ఈసీ ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఓటు హక్కు నమోదు ప్రక్రియపై తాజాగా మరోసారి అవకాశం కల్పించింది. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈలోగా జాబితాలో ఓటు ఉందో? లేదో? పరిశీలించుకుని.. లేని పక్షంలో నమోదు చేసుకోవాలని సూచించింది.
ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని తెలిపిన సీఈసీ.. ఏటా జనవరి, ఏప్రిల్, జులై, అక్టోబరు నెల ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించి ఎప్పటికప్పుడు జాబితాలు వెలువరిస్తోంది. తాజాగా జాబితాను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించగా అందులో పేరు లేనివారు కొత్తగా నమోదు చేసుకోవాలనుకునే వారు ఫారం-8 దరఖాస్తును ఆన్‌లైన్‌లో కానీ నియోజకవర్గ ఎన్నికల అధికారి, సహాయ ఎన్నికల అధికారి లేదా పోలింగ్ కేంద్రం అధికారికి ప్రత్యక్షంగానైనా అందజేయవచ్చని తెలిపింది.
ఓటు నమోదు చేసుకునేందుకు..
https://nvsp.in, https://ceotelangana.nic.inhttps://voters.eci.gov.in/
ఓటు ఉందో.. లేదో.. సరిచూసుకునేందుకు..
https://nvsp.in, https://ceotelangana.nic.in