వరంగల్ కి ఎయిర్ పోర్ట్ దాదాపు క్లియర్ అయినట్లే – మంత్రి ఎర్రబెల్లి

-

తాను 40 సంవత్సరలుగా రాజకీయం లో ఉన్నానని.. కేటీఆర్, కేసీఆర్ అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆన్లైన్ లో అప్లై చేస్తే అన్ని క్లియర్ అయే విధిగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రెండు సంవత్సరాల తరువాత వరంగల్ ప్రపంచ స్థాయి కి వెళ్లే విధంగా తయారవుతుందన్నారు. ఐటీ రంగంలో కూడా ముందుకు పోతున్నామన్నారు. ఇండియా లోనే నెంబర్ వన్ ఐటీ పార్క్ లు మన తెలంగాణ లొనే ఉన్నాయన్నారు మంత్రి ఎర్రబెల్లి.

కాటన్ ఇండస్ట్రీ లో వరంగల్ నెంబర్ వన్ కాబోతుందన్నారు. ఇండస్ట్రీస్ లో వెల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్నారు. వరంగల్, రామప్ప, వేయి స్తంభాల గుడిలకు గుర్తింపు వచ్చిందన్నారు. మహబూబాబాద్ కి కూడా రెండు మెడికల్ కాలేజ్ లు రాబోతున్నాయన్నారు. మునుగోడు ఉప ఎన్నికల తరువాత వరంగల్ మీటింగ్ ఉందని.. ఆ మీటింగ్ లో వరంగల్ ప్రజలకు శుభవార్త చేపబోతున్నామన్నారు. అలాగే వరంగల్ కు మరో హై లెవెల్ బ్రిడ్జి రాబోతుందని.. ఎయిర్పోర్ట్ కూడా దాదాపు క్లియర్ అయినట్లేనని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version