బాంబులతో బస్టాండ్ కూల్చివేత వేశారు. వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ లో చకచకా జరుగుతున్నాయి పాత భవనాల తొలగింపు పనులు. వరంగల్ లోని ఆర్టీసీ సిటీ బస్టాండ్ ను అర్థరాత్రి డిటోనేటర్లతో నేలమట్టం చేశారు. జన సంచారం లేని సమయంలో బాంబులతో ఒక్క పెట్టున కూల్చేశారు.
వరంగల్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్ పాత భవనాల తొలగించి కొత్త భవనాలు నిర్మించేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. రూ. 70 కోట్లతో మోడల్ బస్టాండ్ నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభమయ్యాయి. బహుళ అంతస్తులలో మోడల్ బస్ స్టేషన్ నిర్మించనున్నారు. అయితే దాదాపు 60 ఏళ్ల చరిత్ర కలిగిన పాత బస్టాండ్ ప్రటిష్టంగా ఉంది. తొలగింపు అసాధ్యంగా మారుతుంది. ఈ నేపథ్యంలో నిర్మాణంలో సిటీ బస్ స్టేషన్ ను అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత జనసంచారం లేని సమయంలో జిలేటిన్ స్టిక్స్ తో భవనాలను కూల్చివేశారు.