వరంగల్ అంటే హైదరాబాద్ తో పోటీ నగరం అని మీకు గుర్తుకొస్తది అని.. వరంగల్ కి రెండో రాజధానిగా అన్ని అర్హతలున్నాయి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాజాగా వరంగల్ లో నిర్వహించిన జనజాతర సభలో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కేసీఆర్ నుంచి విముక్తి కలిగించాలంటే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవాలనుకుంటే.. అనుకున్నట్టుగానే గెలిచామని తెలిపారు.
ఎర్రబెల్లి చీడ పురుగులను ఓడించామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న కల్వకుంట్ల ఫ్యామిలీ చీడ పీడ విరగడ చేశామన్నారు. ప్రతీ ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. వరంగల్ ప్రాంతంలో టెక్స్ టైల్స్ పార్కును అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు. వరంగల్ కి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ బాధ్యత నాదే అన్నారు. ఇండస్ట్రీయల్ కారిడర్ తీసుకొచ్చి యువతకు ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.