Kadiyam Kavya :’కావ్య నజీరుద్దీన్‌’ ఇష్యూపై కాంగ్రెస్ క్లారిటీ

-

వరంగల్ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న‌ డాక్ట‌ర్ క‌డియం కావ్యకు వ‌రంగ‌ల్‌తో ఉన్న సంబంధం ఏంటో చెప్పాలని అదే నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ డిమాండ్ చేశారు. కావ్య ఏపీకి చెందిన ముస్లిం మ‌హ‌మ్మ‌ద్ న‌జీరుద్దీన్‌ను ప్రేమించి పెళ్లాడింద‌ని, ఆమె కడియం కావ్య కాదని, మహమ్మద్ కావ్య నజీరుద్దీన్ అని ర‌మేశ్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై వరంగల్ కాంగ్రెస్ నేతలు స్పందించారు. కడియం కావ్యపై బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కావ్యకు తెలంగాణతో సంబంధం లేదని మాట్లాడుతున్న ఆరూరి రమేష్ బీఆర్ఎస్ ఆనవాయితీ కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం కావ్య ఏపీ వాసి అన్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు.

‘ఏఐసీసీ నిర్ణయం తర్వాత నేతలు ఏకతాటిపై కొనసాగుతారు. వరంగల్‌ పార్లమెంటు స్థానం గెలవాలనే పట్టుదలతో పనిచేస్తున్నాం. గత సీజన్‌లో వర్షాలు సరిగా పడకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు. ప్రజల సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వంలో 8 వేలకు పైగా రైతుల ఆత్మహత్యలు జరిగాయి. గతంలో గిట్టుబాటు ధరలు కోరితే బేడీలు వేసి జైలుకు పంపారు. నష్టపోయిన పంటలకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గతంలో ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వలేని పరిస్థితికి తీసుకువచ్చారు. రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల మేర అప్పులపాలు చేశారు.’ అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version