నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మల్లెల తీర్థం నుంచి నీటి ప్రవాహం కొనసాగుతుందని జియోలాజికల్ సర్వే టీమ్ గుర్తించారు. ముఖ్యంగా SLBC టన్నెల్ కి ఎక్కడి నుంచి వాటర్ వస్తుందని NGRI సర్వే చేపట్టింది. ముఖ్యంగా మల్లెవాగు, ఉరుసు వాగు, మల్లెల తీర్థం ప్రాంతాల నుంచి వాటర్ వస్తోంది. ఈ వాగుల ప్రవాహం వల్లనే SLBC టన్నెల్ లోకి వాటర్ వస్తోంది. దీంతో టన్నెల్ లో చిక్కుకున్న వారిని బయటికి తీసేందుకు త్రవ్వకాలు చేపడుతుంటే వాటర్ చేరుతుంది. తీసిన మట్టి మొత్తం బురదమయంగా మారుతుంది.
ఫిబ్రవరి 22న SLBC టన్నెల్ లో ప్రమాదం జరిగి.. 8 మంది సొరంగంలో చిక్కుకుపోయారు. ఈ ఘటన జరిగి నేటికి 9 రోజులు అవుతోంది. టన్నెల్ లోపల ప్రమాదం జరిగిన సంఘటన వద్దకు చేరుకోవడానికే రెస్క్యూ టీమ్ కి దాదాపు 5 రోజుల సమయం పట్టింది. దీంతో సహాయక చర్యల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఇంకొక చోట 7 మీటర్ల లోతులో మరో 4 మృతదేహాలు గుర్తించగా.. వాటిని బయటికీ తీయడం అసాధ్యం అని NDRF సిబ్బంది పేర్కొంటున్నారు.