తెలంగాణకు శుభవార్త.. మరో కొత్త ఎయిర్ పోర్టుపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన

-

వరంగల్ మమూనూర్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్రం ఓకే చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం హైదరాబాద్ కవాడీగూడలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రధాని అయిన తర్వాత విమానయానరంగంలో విప్లవాత్మమైన మార్పులు తెచ్చారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వరంగల్ ఎయిర్ పోర్టు క్లియరెన్స్ ఇవ్వడం ఎంతో సంతోషకంగా ఉందన్నారు. వరంగల్ ఎయిర్ పోర్టు ప్రజల చిరకాల వాంఛ అని చెప్పారు. తన హయాంలో వరంగల్ ఎయిర్ పోర్టుకు సంబంధించి క్లియరెన్స్ రావడం ఎంతో సంతోషనిచ్చిందన్నారు.

గతంలోనే వరంగల్ లో ఎయిర్ పోర్టు ఉండేదని, అది అసియాలోనే అది పెద్దదని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. 1981 వరకూ వరంగల్ ఎయిర్ పోర్టులో కార్యకలాపాలు సాగాయని తెలిపారు. మోడీ ప్రధాని కాక ముందు దేశంలో 79 ఎయిర్ పోర్టులు ఉండేవని.. ఇప్పుడు అవి 150కి పెరిగాయని తెలిపారు. చిన్న చిన్న నగరాల్లోనూ ఎయిర్పోర్టులను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని రామ్మోహన్ నాయుడు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version