కేంద్రంలో మనమే చక్రం తిప్పే అవకాశం రావచ్చు : కేటీఆర్

-

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీకీ సృష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని, బీఆర్‌ఎస్‌ ఎంపీలను ఎక్కువ మందిని గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పవచ్చని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పేర్కొన్నారు.   భువనగిరి పార్లమెంట్‌ స్థానం పరిధిలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం  పాల్గొని మాట్లాడారు.  బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పంచభక్ష పరమాన్నాలు కలిపిపెట్టినా ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం తినలేని పరిస్థితిలో ఉన్నది. తెలంగాణలో బీఆర్ఎస్ 10 నుంచి 12 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.  హైదరాబాద్‌ చుట్టూ ప్రతిష్ఠాత్మకమైన పరిశ్రమలను ఏర్పాటు చేయటానికి మేం అన్నీ సిద్ధం చేసినా రేవంత్‌ సర్కారు చేతకానితనం వల్ల అవన్నీ వెనక్కి వెళ్లే పరిస్థితి వచ్చిందని తెలిపారు.

ప్రము ఖ ఫాక్స్‌కాన్‌ కంపెనీకి భూమి సేకరించి అందించామని, రైతులను ఒప్పించి వేల ఎకరాల భూమిని ఫార్మాసిటీ కోసం సేకరించామ ని వెల్లడించారు. కాంగ్రెస్‌ సర్కారు నిర్లక్ష్యం వల్ల అవి ప్రశ్నార్థకంలో పడ్డాయని దుయ్యబట్టారు. పరిశ్రమలను పెద్దమొత్తంలో ఏర్పాటు చేస్తే, అంతే మొత్తంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రం పుంజుకుంటుందని వివరించారు. పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ సమస్య కూడా తీరుతుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version