BRS రాష్ట్రాన్ని అప్పుపపాలు చేసింది : కొండా సురేఖ

-

దుష్టపాలన అంతమొందించి ఏడాది పాలన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నాం. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా లక్ష మంది మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నాం అని మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్ ను తెలంగాణకు రెండో రాజధాని కోసం అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై దృష్టి సారించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుపపాలు చేసింది. గతంలో ఇక్కడ నిర్వహించిన రాహుల్ గాంధీ సభ విజయవంతమైంది. ఈసభ కూడా విజయవంతం చేయాలి అని కొండా సురేఖ అన్నారు.

ఇక మూసి ప్రక్షాళన అడ్డుకుంటే పురుగులు పడి చస్తారు అని అన్న ఆమె.. వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేటీఆర్ పనే. కేటీఆర్ వెనక ఉండే దాడి చేయించారు. అమాయకులను బలి చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అధికారులు విదేశాల్లో దాచారు. బీఆర్ఎస్ ది తుగ్లక్ పాలన. బీఆర్ఎస్ నేతలకు పిచ్చిపట్టింది. కాబట్టి సైక్రియార్టిస్ట్ కు చూపించుకోవాలి అని పేర్కొన కొండా సురేఖ.. కేటీఆర్ విషయంలో నిజాలు తేల్చిన తర్వాతనే చర్యలు తీసుకుంటాము అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version