అర్హులైన ప్రతీ జర్నలిస్ట్ కి న్యాయం చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ లో సభ్యులకు భూ కేటాయింపు పత్రాల పంపిణీ కార్యక్రమం రవీంద్ర భారతిలో నిర్వహించారు. బషీర్‌బాద్‌లోని 38 ఎకరాల భూమి పత్రాలు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ నేతల్ని ప్రజలు చిన్నచూపు చూసే పరిస్థితి వచ్చింది. రాజకీయ నేతలు తమ స్వార్థం కోసం, తమ వారి కోసమే పనిచేస్తారనే భావన పోగొట్టాలి. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలోకి జర్నలిస్టులను అనుమతించడంపై ఆంక్షలు ఉండేవి. రాజకీయ పార్టీలు పెట్టిన పత్రికల్లో పనిచేస్తున్న వారు కొందరు ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.