హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం హైడ్రా సంచలనంగా మారింది. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యంగా అక్రమార్కులకు దడా పుట్టిస్తోంది. దీంతో తమ జిల్లాల్లో కూడా హైడ్రా వంటి సంస్థలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు. ఇటీవల మహబూబాబాద్ పర్యటనలో జిల్లాల్లో కూడా హైడ్రా వంటి సంస్థలను వ్యవస్థీకరిస్తామని వెల్లడించారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే హైడ్రా కమిషనర్ ఏ.వీ.రంగనాథ్ క్రేజ్ తెచ్చుకున్నారు.
ఇక ఇప్పటికే నిర్మించినటువంటి ఇళ్లను కూల్చివేయబోమని ప్రకటించారు హైడ్రా కమిషనర్. దీనికి సంబంధించి తాజాగా కీలక ప్రకటన విడుదల చేశారు. నివాసముంటున్న గృహాలను కూల్చబోమని.. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలో ఉన్న కొత్త నిర్మాణాలు మాత్రమే కూల్చుతామని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇండ్లు, ఇళ్ల స్థలాలు కొనాలనుకునేవారికి కీలక సూచనలు చేశారు రంగనాథ్. ప్రజలు, చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇండ్లను, ఇళ్ల స్థలాలను కొనుగోలు చేయవద్దని సూచించారు.