ప్రధాని నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డి కలిస్తే తప్పేమిటి : బండి సంజయ్

-

లోక్ సభ ఎన్నికలు దగ్గరపడటంతో రాష్ట్రంలో ముఖ్య నాయకుల కీలక నేతల భేటీలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర పర్యటనకు వచ్చిన నరేంద్ర మోడీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డిపై  బీజేపీ కేంద్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓ రాష్ట్ర సీఎం ప్రధానిని కలిస్తే తప్పేమిటని అన్నారు. అందులో మంచిని చూడాలి కానీ.. ప్రతిదీ రాజకీయం చేయడం సరికాదని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ సీఎం రేవంత్ ఇదే పంథాను కొనసాగిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. గతంలో రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ వస్తే.. కేసీఆర్ ఓ దొంగల దాక్కున్నాడని విమర్శించారు. కనీసం రాష్ట్ర ప్రయోజనాలు, వచ్చే నిధుల గురించి కూడా ఆలోచన చేయలేదని ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కరీంనగర్ పూర్తిగా ‘ఆర్థికంగా దోపిడీకి గురైందని అన్నారు. మళ్లీ ఇప్పుడు ఏం మొహం పెట్టుకుని కేసీఆర్ కరీంనగర్లో సభ పెడుతున్నాడని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీకి దోస్తీ ఉందని కొందరు ప్రచారం చేస్తున్నారని, భవిష్యత్తులో కూడా ఆప పార్టీతో తమకు పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. బూటకపు హామీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజలను పూర్తిగా మభ్యపెడుతోందని ఆరోపించారు. నిరుపేదలకు ఇళ్లు, మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, పెన్షన్ రూ.4 వేలకు పెంపు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరో ఇప్పటి వరకు వారికే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version