ఇందిరమ్మ రాజ్యంలో ఏ వర్గం బాగుపడింది : కేసీఆర్

-

ఇందిరమ్మ రాజ్యంలో ఏ వర్గం బాగుపడింది అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో ఏం మేలు జరిగిందని ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. తెలంగాణ తెచ్చింది ఎవరు? 24 గంటల కరెంట్ తెచ్చింది ఎవరు..? ఏపీ పాలకుల కంటే తెలంగాణ పాలకులు తయారయ్యారు. గుంట భూమి ఉన్న రైతుకు కూడా రూ.5లక్షల బీమాకల్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది. ఇందిరమ్మ రాజ్యంలో జగిత్యాల కల్లోలిత ప్రాంతం అయిందని తెలిపారు. ఎవరిచేతిలో అధికారంలో ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందో ప్రజలు ఆలోచించాలి.

కాంగ్రెస్ గెలిస్తే రాష్ట్రంలో దళారుల రాజ్యం వస్తుందని తెలిపారు. పావుగంటలోనే పట్టా అవుతుందని తెలిపారు. ఇంతకు ముందు ముట్టజెప్పేది ముట్టజెప్పిన తరువాత కూడా ఆరేండ్ల వరకు పట్టా కాకపోయేది. ప్రస్తుతం తెలంగానో దారిపొడవునా ధాన్యం గెలిపిస్తుంది.
జగిత్యాలలో జీవన్ రెడ్డి గెలిస్తే ఏం చేస్తాడని ప్రశ్నించారు. జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ ని గెలిపిస్తే.. అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ కి అధికారంలోకి వస్తే.. ఎల్లమ్మ కూడబెడితే.. మల్లమ్మ మాయం చేసినట్టు ఉంటుందని సామెత చెప్పుకొచ్చారు కేసీఆర్. తెలంగాణకు అన్యాయం చేసింది ఆంధ్రవాళ్ల కంటే కాంగ్రెసే అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version