శాసనసభ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్‌ ఎవరు.. ఇప్పుడంతా దీనిపైనే చర్చ

-

తెలంగాణలో కొత్త సర్కార్ కొలువుదీరింది. సీఎంతో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వారికి శాఖలు కేటాయించాల్సి ఉంది. అయితే రేపటి నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొత్త సర్కార్ వచ్చిన తర్వాత జరగబోయే తొలి సమావేశాలకు ప్రొటెం స్పీకర్‌గా ఎవరు వ్యవహరిస్తారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

కొత్తగా ఎన్నికైన సభ్యులతో మొదటగా ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్‌ను ఎన్నుకునేంత వరకు ప్రొటెం స్పీకర్‌ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా ఎక్కువసార్లు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు. అయితే ప్రస్తుతం ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జాబితాలో అత్యధికంగా ఎనిమిది సార్లు ఎన్నికైన ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారు.

మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఆరుసార్లు ఎన్నికయ్యారు. ఇక కాంగ్రెస్‌లో ఆరుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావులు ఇద్దరూ మంత్రులుగా నియమితులయ్యారు. ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ పరిస్థితుల్లో ఎవరు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తారనే విషయం ఇప్పుడు ఆసక్తి నెలకొల్పుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version