సీఎం రేవంత్ రెడ్డి దావోస్ ఎందుకు వెళ్లారో చెప్పాలి : హరీశ్ రావు

-

గజ్వేల్ ఎమ్మెల్యే గా కేసీఆర్ ను గెలిపించిన సందర్భంగా గజ్వేల్ పట్టణం లోని శోభా గార్డెన్ లో ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు. గజ్వేల్ ప్రజల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేశారు. గజ్వేల్ లో ఒక్క సారి గెలిస్తే మరొక్క సారి గేలవరు అన్న సెంటిమెంట్ పోయి మూడు సార్లు కేసీఆర్ గెలిచాడు. అయితే సీఎం రేవంత్ రెడ్డి తాజాగా దావోస్ వెళ్లారు.

కేటీఆర్  దావొస్ కు వెళ్తే డబ్బులు దండగ అన్నారు.. ఇప్పుడు మీరెందుకు వెళ్లారో చెప్పాలి. బిజెపితో కొట్లాడతామని అన్నారు మీరు ఎక్కడ కొట్లాడారు. బిజెపిలో బండి సంజయ్, రఘునందన్ రావ్, అరవింద్, ఈటల రాజేందర్ ఓడిపోవడానికి కారణం బి అర్ ఎస్ పార్టీ అన్నారు.  అధాని అవినీతి వెనుక ప్రధాని ఉన్నాడనీ రాహుల్ అంటే రేవంత్ రెడ్డి వెళ్లి కౌగిలించు కుంటారు. ఎవరు కరెక్ట్ అర్థం కావడం లేదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు నేను ఎప్పుడూ అండగా ఉంటా. ఏ కార్యకర్తలకు ఇబ్బందులు వచ్చినా ఏ కేసులు అయినా నేను మీకు అండగా ఉంటా, ఎప్పుడయినా నాకు మీరు ఫోన్ చేయవచ్చును.

Read more RELATED
Recommended to you

Exit mobile version