అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రోజులు దగ్గరపడుతున్నాయి. జనవరి 22న అంగరంగ వైభవంగా ప్రాణ ప్రతిష్ట చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా కొన్ని రాష్ట్రాలు జనవరి 22న పబ్లిక్ హాలిడేగా ప్రకటించాయి. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పలువురు వీవీఐటీలు ఈ వేడుకకు హాజరుకానున్నారు. హాజరైన వారందరికీ ‘రామ్ రాజ్’తో సహా ప్రత్యేక బహుమతులను అందజేసి వారిని సత్కరించడానికి ట్రస్ట్ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇంతకీ ఏ రాష్ట్రాలు ఏంటంటే..
ఉత్తరప్రదేశ్..
జనవరి 22న రామ మందిర్ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా మద్యం షాపులు కూడా ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మూత పడనున్నాయి.
మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ జనవరి 22న పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ రోజును ప్రతి ఒక్కరూ పండుగలా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మద్యం షాపులతో సహా అన్ని రకాల షాపులు బంద్ అవుతాయని ఎక్స్‌లో తెలిపారు. అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్ధులకు గోవా ప్రభుత్వం జనవరి 22న అధికారిక సెలవు ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రమోద్ సావత్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
చత్తీస్‌ఘడ్
అయోధ్యలోని రామమందిరంలో నూతన విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలను పురస్కరించుకుని జనవరి 22న అన్ని రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ సమాచారాన్ని ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
హర్యానా
రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా జనవరి 22న పాఠశాలలను మూసివేస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. పవిత్రోత్సవం రోజున రాష్ట్రంలో అన్ని మద్యం షాపులను మూసివేయాలని ఆదేశించారు.