రాష్ట్రంలో నేడు మద్యం దుకాణాల లక్కీడ్రా

-

తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపునకు నిర్వహిస్తున్న లక్కీ డ్రాకు రాష్ట్ర అబ్కారీ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 2 వేల 620 మద్యం దుకాణాల కేటాయింపునకు అధికారులు.. ఇవాళ లక్కీ డ్రా నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 34 ఎక్సైజ్‌ జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా రెవెన్యూ జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో దరఖాస్తుదారుల సమక్షంలో ఈరోజు ఉదయం పదిన్నర నుంచి దుకాణాల వారీగా డ్రా నిర్వహిస్తారు.

శంషాబాద్‌, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌ ఎక్సైజ్‌ జిల్లాలకు ప్రత్యేక అధికారులను అబ్కారీ శాఖ నియమించింది. దరఖాస్తులు అధికంగా వచ్చిన ఎక్సైజ్‌ జిల్లాల్లో లక్కీ డ్రా నిర్వహణ రాత్రి వరకు కొనసాగే అవకాశమున్నట్లు అధికారులు భావిస్తున్నారు. డ్రాలో ఎంపికైన వ్యాపారులు ఈనెల 23వ తేదీలోగా నిర్ణీత వార్షిక లైసెన్స్‌ రుసుంలో ఆరో వంతు చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్‌దారులు డిసెంబర్‌ 1వ తేదీ నుంచి… కొత్త మద్యం దుకాణాల్లో విక్రయాలు సాగించేందుకు అనుమతిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version