‘పుష్ప 2’ రిలీజ్…. తొక్కిసలాటలో మహిళ మృతి!

-

పుష్ప-2 రిలీజ్‌ అయిన తరుణంలోనే తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళా ప్రేక్షకురాలి ప్రాణం తీసింది అల్లు అర్జున్‌ పుష్ప 2 సినిమా. నిన్న రాత్రి పుష్ప-2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళా ప్రేక్షకురాలి ప్రాణాలు పోయాయి. దిల్షుఖ్ నగర్ ఏరియాకి చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9) , సన్వీక (7) కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ రోడ్స్ లోని సంధ్య 70 mmకు రావడం జరిగింది..

Woman dies in stampede near Pushpa 2 theatre

ఈ తరుణంలోనే.. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చిన సమయంలో అభిమానులు థియేటర్ గేటు లోపలికి చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి, ఆమె కొడుకు శ్రీ తేజ లుఅపస్మారక స్థితిలోకి వెళ్లడం జరిగింది. వెంటనే పోలీసులు విద్య నగర్ లోని దుర్గ భాయి దేశముఖ్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. కాగా రేవతి అప్పటికే మృతి చెందగా, శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. రేవతి మృతదేహాన్ని దుర్గాబాయి దేశముఖ్ హాస్పిటల్ నుండి గాంధీ మార్చురీకి తరలించడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version