ఎవరైతే బీసీ కులగణనలో పాల్గొనరో వాళ్ళని సామాజిక బహిష్కరణ చేయండి – సీఎం రేవంత్ రెడ్డి

-

ఎవరైతే బీసీ కులగణనలో పాల్గొనరో వాళ్ళని సామాజిక బహిష్కరణ చేయండి అని  సీఎం రేవంత్ రెడ్డి సెన్షేషన్ కామెంట్ చేశారు. పెద్దపల్లిలో నిర్వహించిన యువ వికాసం సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ రూ.1.02 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని విమర్శించారు. మేము కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్, శ్రీరాం సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు 60 ఏళ్లు ఎలా ఉన్నాయో, నువ్వు కట్టిన కాళేశ్వరం ఎళా ఉందో చూడటానికి రా.. లెక్కలు తేలుద్దామని సవాల్ చేశారు.

కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు లేకపోయినా రికార్డు స్థాయిలో కోటి మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని సీఎం తెలిపారు. గ్రూపు-4 ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. తెలంగాణ తెచ్చుకున్నది ఉద్యోగాల కోసమేనని తెలిపారు. పదేళ్లు పరిపాలించిన కేసీఆర్.. ఎకరాకు రూ.కోటి ఎలా సంపాదించాలో మాత్రం రైతులకు చెప్పలేదన్నారు. కేసీఆర్ శాసన సభకు రావాలి.. తన మేధావితనాన్ని ప్రజలకు పంచాలి అన్నారు. ఎకరంలో రూ.కోటి పంట ఎలా పండించారో రైతులకు చెప్పాలన్నారు. బీసీ కులగణనలో కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. ఈ ముగ్గురు బీసీ వ్యతిరేకులా..? బీసీల ఓట్లు వేయించుకోలేదా..? ఒక మంచి పని కోసం ప్రభుత్వాలు ముందుకొచ్చినప్పుడు సహకరించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version