హైదరాబాద్‌లో బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది..గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హౌస్ అరెస్ట్‌ను నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా..ఒంటిపై పెట్రోల్ పోసుకుని యువకుడు శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు..ఒంటికి మంటలు అంటుకొని అరుపులతో రోడ్డుమీద తిరుగుతున్న వ్యక్తిని చూసిన వాహనదారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు..అక్కడే ఉన్న స్థానికులు శ్రీనివాస్ ఒంటిపై మంటల్ని ఆర్పారు..ఈ ప్రమాదంలో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు..
శ్రీనివాస్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడెం వాసిగా గుర్తించారు..బీజేపీ అంటే నాకు ప్రాణమని ..పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి అయినా సిద్దంగా ఉంటానని..బండి సంజయ్ అరెస్ట్ నన్ను కలచివేసిందని అందుకే అత్మహత్యాయత్నం చేసుకున్నానన్నాడు యువకుడు శ్రీనివాస్..కేసీఆర్‌గాని..తెలంగాణ ప్రభుత్వంగాని బీజేపీని..బండి సంజయ్‌ను ఏం చేయలేరని గాయాలతో బాధపడుతూ నినాదాలు చేశారు..ఘటన స్థలానికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు..గతంలో ఎప్పడో బండి సంజయ్‌ను అరెస్ట్ చేస్తే ఈ రోజు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం పట్ల స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..ఈ నెల 3న దుబ్బాక ఉప ఎన్నిక జరుగుతుండటంతో ఇప్పుడు ఇలాంటి సంఘటన జరగడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ ముందు వ్యక్తి హల్‌చల్..పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం
-