ప్రముఖ తెలుగు యూట్యూబర్ అరెస్ట్

-

ప్రముఖ యూట్యూబర్ చంద్రశేఖర్ సాయి కిరణ్ ని పోలీసులు అరెస్టు చేశారు. తనపై అత్యాచారం చేసి, మోసం చేశాడని అతనిపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నార్సింగి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 2021 ఏప్రిల్ 25 న పుట్టిన రోజు వేడుకలకు యువతిని పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు చంద్ర శేఖర్.

Youtuber Chandrasekhar Sai Kiran Arrested

దీంతో నిందితుడు పై 420,376 ( 2) , ఎస్సీ , st అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. చంద్రశేఖర్ తోపాటు ఆయన తల్లి దండ్రులు, మరో ఇద్దరి పై కేసులు నమోదు అయింది. నిందితుడు యూట్యూబర్ చంద్ర శేఖర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. కాగా, చందుగాడు, పక్కింటి కుర్రాడు యూట్యూబ్ ఛానల్స్ లో వీడియోలు చేస్తూ చంద్రశేఖర్ సాయి కిరణ్ ఫేమస్ అయ్యాడు. కొన్ని సినిమాల్లోనూ నటించాడు చంద్రశేఖర్ సాయి కిరణ్.

 

Read more RELATED
Recommended to you

Latest news