కొడుకు, కూతురు పేరు మీద ఆస్తులు బదిలీ చేసిన వైఎస్ షర్మిల..

-

వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకుంది. కొడుకు, కూతురు పేరు మీదకు తన ఆస్తులు బదిలీ చేసింది వైఎస్ షర్మిల. కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించారు షర్మిల. నేడు దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 74 వ జయంతి అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం 7.30 గంటలకు ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు వైఎస్ షర్మిల.

ఇది ఇలా ఉండగా, నిన్న కడప విమానాశ్రయం నుంచి నేరుగా వేంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లిన షర్మిల ఇడుపులపాయలో తన పేరుతో ఉన్న 9.53 ఎకరాలను కుమారుడు రాజారెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. ఇడుపులపాయ ఎస్టేట్ వ్యవహారాలు చూసే వెంగముని రెడ్డి నుంచి షర్మిల కొనుగోలు చేసిన 2.12 ఎకరాల భూమిని కుమార్తె అంజలి రెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. అనంతరం షర్మిల కుటుంబ సభ్యులు వేంపల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ఇడుపులపాయ ఎస్టేట్ కు చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version