ఇలాంటి ఇళ్లల్లో ప్రేతాత్మలు ఉంటాయి.. ఇల్లు మారేటప్పుడు కచ్చితంగా వీటిని చూసుకోండి..!

-

చాలామంది ఇల్లు మారుతూ ఉంటారు ఇల్లు మారేటప్పుడు కచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఇల్లు మారేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు. సొంత ఇల్లు కట్టేటప్పుడు ఎలా అయితే వాస్తును చూస్తారో అలానే అద్దె ఇల్లు మారేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏదైనా అద్దె ఇంటికి వెళ్ళేటప్పుడు కచ్చితంగా ఏ దిక్కు బాగుంటుంది అనేది చూసుకోవాలి.

అలానే ఆ ఇంటి గురించి ముందు తెలుసుకోవాలి. వాస్తు పరంగా ఇల్లు బాగుందా లేదా అనేది చూసుకోవడంతో పాటుగా ముఖద్వారం గురించి కూడా చూసుకోండి. ఇవన్నీ చూసుకుని అప్పుడు ఇల్లు మారండి, అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇల్లు చాలా ఏళ్ళు ఖాళీగా ఉండిపోతూ ఉంటుంది అటువంటి ఇంట్లో దిగితే మాత్రం ప్రమాదం. ఎందుకంటే ఇలాంటి ఇళ్లలో ప్రేతాత్మలు తిరుగుతూ ఉంటాయి. గరుడ పురాణం ప్రకారం చూసినట్లయితే మనిషి చనిపోయిన తర్వాత కర్మకాండలు చేయాలి.

కర్మకాండలు చేయకపోతే ప్రేతాత్మ అయ్యి ఆ మనిషి తిరుగుతాడు భూమి అంతరించే వరకు కూడా ఆ ప్రేతాత్మ భూమిలో తిరుగుతూనే ఉంటుంది. ఖాళీగా ఉండే ఇళ్లల్లో ప్రేతాత్మలు తిరుగుతూ ఉంటాయి. ఇల్లు ఎక్కువ రోజులు ఖాళీగా ఉన్నట్లయితే ఆ ఇంటిని ముందు మీరు గోమూత్రంతో శుభ్రం చేయాలి 11 రోజులపాటు ఉప్పు నీళ్లతో ఇంటిని శుభ్రం చేస్తే ప్రేతాత్మలు పారిపోతాయి. దైవపరమైన శ్లోకాలు స్తోత్రాలు వంటివి అక్కడ పాడితే కూడా అవి పోతాయి. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుని ఆ తర్వాత మారడం మంచిది. ఖాళీగా ఉండే ఇళ్ళకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version