A compassionate leader of the people, he steered the development and welfare of Andhra Pradesh till his last breath.
Our homage to Former Chief Minister of Andhra Pradesh, Y. S. Rajasekhara Reddy on his birth anniversary.
His contribution to public life and to the Congress… pic.twitter.com/oT4xh2mn31
— Mallikarjun Kharge (@kharge) July 8, 2023
ఈ రోజు జులై 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకోసమే జన్మించిన కారణజన్ముడు మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి. ఈ రోజున పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, వైఎస్సార్ అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆయనను మరోసారి స్మరించుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న మల్లిఖార్జున ఖర్గే ఎమోషనల్ కామెంట్ ను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్సార్ చేసిన సేవలు మరువలేనివన్నారు. ఇక ప్రజల బాగు కోసమే నిరంతరం శ్రమిస్తూ వారి కోసం ఏమి చేస్తే బాగుంటుందా అంటూ అనేక పధకాలను ప్రవేశ పెట్టిన ఘనత వైఎస్సార్ దక్కుతుందన్నారు. ప్రజలకు ఆయనమీద ఆయనకు ప్రజల మీద అమితమైన ప్రేమ ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయం అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు మల్లిఖార్జున ఖర్గే.