ప్రజాపాలన సేవా కేంద్రాల్లో జీరో కరెంట్ బిల్లుల ఫిర్యాదుల వెల్లువ

-

ప్రజాపాలన అర్జీలను పరిష్కరించుకోవడానికి హైదరాబాద్ వాసులు బారులు దీరుతున్నారు. గృహజ్యోతి పథకం కింద విద్యుత్తు జీరో బిల్లు రాని వారు, వంటగ్యాస్‌కు రాయితీ మొత్తం జమ కాని వారంతా సేవా కేంద్రాలకు వచ్చి తమ వివరాలు ఇచ్చి ఫిర్యాదు చేస్తున్నారు.వీటిని అప్పటికప్పుడే పరిశీలించి అధికారులు అనుసంధానం చేస్తున్నారు. వారం రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

నగరవ్యాప్తంగా విద్యుత్తు శాఖ అధికారులు బిల్లులు జారీ చేస్తుండటంతో కొందరికి ‘జీరో’ బిల్లులు వస్తున్నాయి. కానీ మరికొందరికి మాత్రం బిల్లు చెల్లించాలని రసీదులో సూచిస్తుండటంతో వారంతా నగరపాలికకు తరలి వస్తున్నారు. దరఖాస్తు చేసి ఉండటం, ప్రజాపాలన సేవా కేంద్రంలోని ఆన్‌లైన్‌లో అర్హతగా చూపిస్తుండగా వీరంతా ఎక్కడికి వెళ్లాలనే విషయం తెలియక గందరగోళానికి గురవుతున్నారు. విద్యుత్తు కార్యాలయాల దగ్గర ఆయా అధికారులు ఏమాత్రం సమాచారం ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. కొందరు దరఖాస్తు సమయంలో గ్యాస్‌, విద్యుత్తు ఐచ్ఛికం ఎంచుకోకుండా మళ్లీ దరఖాస్తులు ఇవ్వడానికి వస్తుండటం, వాటిని తీసుకోకపోవడంతో వారు అయోమయంలో పడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version