మరోసారి దొరికిపోయిన విజయ్-రష్మిక.. ఈసారి క్యాప్ పట్టించేసింది

-

టాలీవుడ్లో బెస్ట్ కపుల్ లిస్టులో విజయ్ దేవరకొండ, రష్మికల పేరు తప్పకుండా ఉంటుంది. గీతా గోవిందం సినిమా ఈ జంట హిట్ పెయిర్గా పేరు తెచ్చుకుంది. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరు ప్రేమలో పడినట్లు టాక్. అప్పటి నుంచి వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని ఇండస్ట్రీలో జోరుగా వార్తలు వస్తున్నాయి. అయినా ప్రతిసారి ఈ జంట తాము మంచి ఫ్రెండ్స్ అంటూ లవ్ గాసిప్స్ను కొొట్టిపారేస్తూ వస్తున్నారు. అయితే వారు చేసే కొన్ని పనుల వల్ల మాత్రం వారు రిలేషన్షిప్లో ఉన్నారని నెటిజన్లకు హింట్ ఇస్తున్నారు.

ఇప్పటికే పలుమార్లు వెకేషన్కు వెళ్లి అక్కడి ఫొటోలను షేర్ చేస్తూ దొరికిపోయిన ఈ జంట తాజాగా మరోసారి వారు ప్రేమలో ఉన్న విషయాన్ని హింట్ ఇచ్చింది. కొద్దిరోజుల కిందట విజయ్ దేవరకొండ తన బ్రాండ్ రౌడీ వేర్ను ప్రమోట్ చేస్తూ ఒక వీడియోను విడుదల చేశాడు. అందులో అతను ఒక బేబీ పింక్ కలర్లో ఉండే క్యాప్ను పెట్టుకొని కనిపించాడు. మహిళా దినోత్సవం సందర్భంగా రష్మిక ఈనెల 8న ఇన్స్టాలో పెట్టిన ఓ పోస్టులోనూ అంతకుముందు విజయ్ పెట్టుకొని కనిపించిన పింక్ క్యాప్నే ధరించి కనిపించింది. దీంతో ఇద్దరు సేమ్ టు సేమ్ క్యాప్ పెట్టుకున్నారేంటబ్బా అన్న చర్చ మొదలైంది. మరోసారి వీరి లవ్ ట్రాక్ నెట్టింట చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version