మొబైల్ ఫోన్ వాడే వారికి ఊహించని షాక్ తగిలింది. మరో సారి మొబైల్ ఛార్జీ లు పెరిగే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొబై ల్ రీఛార్జ్ ప్లాన్ ధరలు మళ్లీ పెంచే యోచనలో టెలికాం సంస్థలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరికి 10% నుంచి 12% పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

5G సదుపాయాల నేపథ్యంలో బేస్ ప్లాన్లు కాకుండా మధ్య అలాగే ఉన్నతశ్రేణి ప్లాన్లను పెంచే యోజనలో టెలికాం కంపెనీలు ఉన్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారట. దీంతో మొబైల్ వినియోగించే వారికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కాగా రిలయన్స్ ఓనర్ అంబానీ చిన్న కుమారుడు పెళ్లి జరిగిన తర్వాత… రీఛార్జ్ ధరలు పెరిగాయి. ఆ తర్వాత అన్ని కంపెనీలు కూడా జియో బాటలో నడిచాయి.