లాక్ డౌన్ లో చాలా వరకు నష్టాలు చూస్తున్నాయి కంపెనీలు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ కంపెనీ అయినా సరే ఇప్పుడు నష్టాల్లోనే ఉంది. దాదాపుగా చాలా వరకు పరిశ్రమలు కూడా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నాల్లోనే ఉన్నాయి అనే విషయం చెప్పవచ్చు. దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి ఉంది. ఇక ఈ లాక్ డౌన్ సమయంలో టెలికాం కంపెనీలు బాగానే నష్టపోయాయి.
అనేక ఆఫర్లు వినియోగదారులకు ఇచ్చేసాయి. దీనితో ఇప్పుడు నష్టాలు ఎదుర్కొంటున్న కంపెనీలు అన్నీ కూడా… ధరలను పెంచాలి అని భావిస్తున్నాయి. ఎయిర్టెల్ కూడా ధరలను పెంచే ఆలోచనలో ఉంది. జియో కూడా ఇదే ఆలోచన చేస్తుంది. కనీసం 10 శాతం అయినా ధరలను పెంచే ఆలోచన చేస్తున్నాయి. అంతే కాదు… డేటా ప్యాక్ సహా ఉచిత కాల్స్ విషయంలో కాస్త ఆలోచించే అవకాశాలు కనపడుతున్నాయి.
ఈ ఆఫర్స్ ని ఇక వద్దు అనే ఆలోచనలో ఉన్న కంపెనీలు అంటున్నారు. దీనితో ఇప్పటికే నష్టపోయాం అని ఇప్పుడు వద్దు అని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. లేదా డేటా ప్యాక్ ధరలను పెంచే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన కూడా వచ్చే సూచనలు కనపడుతున్నాయి ప్రస్తుతం.