చిరు పోస్ట్ చేసిన ఫోటోలో ఎవరో చెప్పుకోండి…!

-

వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో ఒక ఫోటో పోస్ట్ చేశారు. తాను తీసిన మొదటి ఫోటో అంటూ ఆయన ఐదుగురు నిలబడి ఉన్న ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను పోస్ట్ చేసి, ఆ ఫోటో ని తాను తీసినట్టు ఆయన పేర్కొన్నారు. అయితే ఆ ఫోటోలో ఉన్న ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు చెప్పుకోండి చూద్దాం, నేను తీసిన మొదటి ఫోటో అంటూ పోస్ట్ చేశారు.

అయితే అందులో చెప్పులు వేసుకుని అందరి కంటే పొట్టిగా ఉన్న ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అందులో పవన్ కళ్యాణ్ కాస్త పొట్టిగా నల్ల బట్టలు వేసుకుని నిక్కరుతో కనపడుతున్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నేడు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో పలు ఫోటోలను పోస్ట్ చేస్తూ సందడి చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version