కేఆర్ఎంబీ సమావేశం.. తెలుగు రాష్ట్రాల అధికారులు గైర్హాజరు

-

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు జలాశయాల పర్యవేక్షక కమిటీ ఇవాళ మరోసారి సమావేశమైంది. హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ సభ్యుడు రవికుమార్ పిళ్లై ఆధ్వర్యంలో భేటీ జరిగింది. ముందుగా ఊహించినట్టే ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు హాజరుకాలేదు. కేవలం బోర్డు అధికారులతోనే సమావేశం కొనసాగింది.

శ్రీశైలం, నాగార్జునసాగర్​లో జలవిద్యుత్ ఉత్పత్తి కోసం మార్గదర్శకాలు, వరదజలాల లెక్కలు, రూల్ కర్వ్స్​కు సంబంధించిన నివేదికను ఖరారు చేసి సంతకాలు చేసేందుకు గతంలోనే ఆర్ఎంసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వివిధ కారణాల రీత్యా సమావేశం వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఆర్ఎంసీ ఐదో సమావేశాన్ని ఇవాళ నిర్వహించారు. ముందుగా ఖరారైన కార్యక్రమాలు ఉన్నందున తమకు వీలు కాదని.. మరోరోజు సమావేశం నిర్వహించాలని ఏపీ అధికారులు ఇప్పటికే బోర్డుకు లేఖ రాశారు.

అటు తెలంగాణ అధికారులు కూడా ఆర్ఎంసీ సమావేశంపై అసంతృప్తిగా ఉన్నారు. తమ అభిప్రాయాలను పొందుపరచడం లేదని.. తాము అడిగిన సమాచారం ఇవ్వడం లేదని అన్నారు. తమ అభిప్రాయాలను నివేదికలో పొందుపర్చడంతో పాటు కోరిన సమాచారం ఇచ్చిన తర్వాతే సమావేశం నిర్వహించాలని ఇప్పటికే లేఖ కూడా రాశారు. ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల అధికారులు హాజరు కాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version