ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ వర్షాలు తెలంగాణలో అదిలాబాద్, నిర్మల్, కొమురం భీమ్, మంచిర్యాల జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
కానీ రాబోయే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం పలు ప్రాంతాల్లో ఉక్కపోత సంభవించింది. రాబోయే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో కాస్త ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంది. కనిష్టంగా 22 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.