ఏ బంధంలో అయిన గొడవలు సహజం.. ముఖ్యంగా భార్య భర్తల కాపురంలో అలకలు, గొడవలు లేకుంటే అస్సలు బాగోదు..కొంతమంది చిన్న చిన్న వాటికే విడిపోతారు.. మరి కొంతమంది పెద్ద కారణాల వల్ల విడిపోయి నూరేళ్ల కాపురాన్ని సగంలోనే వదిలేస్తారు.ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా జీవితం మొత్తం ప్రేమించిన చేయి విడవమని నమ్మకం ఎదుటివారికి కలిగించాలి. అప్పుడే ఆ బంధం.. చక్కని అనుబంధమై ఆనందంగా ఉంటుంది. ఇలా జరగాలంటే ప్రేమించిన వారికి కొన్ని వాగ్దానాలు చేయాల్సి ఉంటుంది. అవి మీలోని భావాలను వారికి చెప్పినట్లుగా ఉండాలి. అలాంటి ప్రామిస్‌లు ఏంటో ఇప్పుడు చూద్దాం..
*. దంపతులు ఎప్పటికప్పుడు ప్రేమిస్తూ మీ ప్రేమతో వారిని ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసి వారి హృదయాన్ని గెలుస్తామని చెప్పడం. ఎన్ని సంవత్సరాలైనా ఇలానే అన్యోన్యంగా కలిసి ఉంటామని చెబుతూ మాట ఇవ్వడం. దీంతో ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. హ్యాపీగా టైమ్‌ని గడొపొచ్చు..
*. ఎంత పెద్ద సమస్య వచ్చినా.. ఎలాంటి గొడవ వచ్చినా హద్దు దాటి మాటలని బాధపెట్టనని చెప్పండి. ఇలా చేయడం వల్ల వారు మిమ్మల్ని నమ్ముతారు. వారి ప్రేమని మీరు ఆస్వాదించినవారవుతారు. మాట ఇవ్వడమే కాదు. ఆ మాటకి కట్టుబడి ఉండటం ముఖ్యం..
*. ఎలాంటి వాటిని ఇష్టపడవో వాటిని నీ దగ్గర ప్రస్తావించను.. నిన్ను నేను హ్యాపీగా ఉంచుతూ ఇద్దరం కూడా ఒకర్నొకరం బాధపెట్టుకోకుండా ఉంచుకుందామని మాట ఇవ్వండి.
*. గతంలో ఏవైనా తప్పులు జరిగితే వాటిని అప్పుడే వదిలే ఎలాంటి విషయంలోనూ నిన్ను జడ్జ్ చేసి బాధపెట్టనని మాట ఇవ్వండి. దీని వల్ల భవిష్యత్, ప్రస్తుత జీవితంలో బాధలు చుట్టుముట్టవని తనకి అర్థమయ్యేలా ఒకటికి పదిసార్లు చెప్పండి..
*. ఏదైనా తప్పు జరిగినప్పుడు దానిని సాల్వ్ చేసుకునేందుకు కాంప్రమైజ్ అవ్వడంలో ఎలాంటి ఇబ్బంది పడను అన్న మాట ఇవ్వండి. దీని వల్ల చాలా వరకూ సమస్యలు దూరమవుతాయి.
*. రోజుకో విధంగా ఆమెకు వీలైంత ప్రేమను పంచాలి.. ఆ ప్రాపార్టీకి ఓనర్ నేనే అని ఫీల్ అయితే ఎటువంటి గొడవలు ఉండవు..
*. ఎంత బిజీ ఉన్నా…. ఏ పరిస్థితులు వచ్చినా నీతో కచ్చితంగా సమయం గడుపుతానంటూ మాట ఇవ్వండి. దీని వల్ల ఇద్దరి మధ్య ఆనందం రెట్టింపు అవుతుంది.. బంధం బల పడుతుంది..
*. ఏ పని అయినా కలిసి చేసుకోవడం. అది ఎంజాయ్ అయినా, వర్కౌట్ అయినా, ఎలా అయినా సరే కలిసి ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ కలిసి చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు..
ఈ ప్రామిస్ లను ప్రతి దంపతులు గుర్తుపెట్టుకుంటే సంసారం సాఫిగా సాగిపోతుంది.. ఇది గుర్తుపెట్టుకోండి..