హైదరాబాద్ మక్కా మసీదు వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం యువకులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఆందోళన చేపట్టారు. బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు. కొద్దిసేపు ఆందోళనల తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది.
కాగా బిజెపి నాయకురాలు ఆ పార్టీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ 12 రోజుల కిందట ఓ టీవీ డెబిట్ లో మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి తీవ్ర దుమారాన్ని దారితీశాయి. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరం అంటూ కొన్ని ఇస్లామిక్ దేశాలు నిరసన వ్యక్తం చేశాయి. తమ మత విశ్వాసాలను కించపరిస్తే సహించేది లేదని మండిపడుతున్నాయి. కొన్ని దేశాల్లో భారతీయ ఉత్పత్తుల్ని బహిష్కరించాలని పిలుపునిచ్చే స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చార్మినార్ వద్ద ఆందోళనలు నిర్వహించే అవకాశం ఉందని ముందే గ్రహించిన పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.