జమ్ముకాశ్మీర్‌లోని పహెల్గాం జిల్లాలో ఉగ్రవేట కొనసాగుతోంది. ఉగ్రవాదుల కోసం ఆర్మీ, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సంయుక్తంగా అడవులను జల్లెడ పడుతున్నాయి. పూంచ్, బారాముల్లా అడవులను శోధిస్తూ ఉగ్రవాదులు ఫారెస్ట్‌లో నక్కి ఉండవచ్చనే అనుమానంతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
ఉగ్రవాదులను ఏరివేసే వరకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగించనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. కాగా, జమ్ముకాశ్మీర్‌లోని టూరిస్టు స్వర్గధామం అయిన పహెల్గంలో నలుగురు ఉగ్రవాదులు టూరిస్టులను విచక్షణా రహితంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాని మోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా నేడు కేబినెట్ అఖిల భేటీ నిర్వహిస్తున్నారు.అనంతరం ఉగ్రదాడిపై ఎటువంటి చర్యలు తీసుకోనున్నారో తెలియనుంది.