ఢిల్లీలో ఉగ్రవాదుల కదలికలు…? ఎన్నికలకు ముందు ఎం జరుగుతుంది…?

-

మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్న దేశ రాజధాని ఢిల్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ పోలీసులు ముగ్గురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని ఒక భారీ కుట్రను భగ్నం చేసారు. ఇప్పుడు వార్త ఢిల్లీ వాసులను కలవరపెడుతుంది. త్వరలో ఢిల్లీలో సార్వత్రిక ఎన్నికలు ఉండటం, గణతంత్ర వేడుకలు కూడా ఉండటంతో ఎప్పుడు ఎం జరుగుతుందో అని ఢిల్లీ వాసులు భయపడుతున్నారు.

ఢిల్లీలోని వజీరాబాద్ ప్రాంతంలో ఇవాళ ఉదయం జరిగిన ఓ ఎన్‌కౌంటర్ తర్వాత ఐఎస్ఐఎస్‌తో సంబంధాలున్న ముగ్గురు ఉగ్రవాదులను పట్టుకున్నామని ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడు పోలీసులు ఓ జిహాదీ ఉగ్రవాద ముఠాను పట్టుకున్న రోజే ఢిల్లీ పోలీసులు వారిని అరెస్ట్ చేసారు. గత కొంత కాలంగా ఏ రాష్ట్రంలో అయినా సరే ఎన్నికలు జరుగుతున్న సమయంలో, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.

మహారాష్ట్ర హర్యానా ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. భారత ఆర్మీ సరిహద్దుల్లో ఉగ్రవాదులను కాల్చి చంపిన విషయం అందరికి తెలిసిందే. సర్జికల్ స్త్రైక్స్ పేరుతో వారిని అంతం చేసింది. ఇక ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో కూడా అలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. విపక్షాలు మాత్రం బిజెపి కావాలనే ఇలాంటివి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సృష్టిస్తు౦దని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version