కూకట్పల్లి మండలం తెలంగాణ గెజిటెడ్ అధికారుల్లో గత కొంతకాలంగా జోనల్ కమిషనర్ గా పనిచేసిన మమతని సర్కార్ ట్రాన్స్ఫర్ చేసింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. జోనల్ కమిషనర్ మమత బిఆర్ఎస్ పార్టీ విధేయురాలుగా పని చేస్తున్నట్లు ఆరోపణలు అయితే ఉన్నాయి తనకి కావాల్సిన చోట పోస్టింగ్ వచ్చిన గంటలోపే ఆమెకి వచ్చిన బదిలీ ఉత్తర్వులని గంటలోగా మంత్రి సహాయంతో వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వలన మమతపై వేటు పడుతుందని అంతా భావించారు. రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణస్వీకారం చేసిన కొన్ని రోజులకే టీజీఓ సంఘం తరఫున జోనల్ కమిషనర్ మమతా సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఇప్పుడు ఈమె మీద పడదని అంతా భావించినా కూడా. శనివారం ప్రభుత్వం మమతకి డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆమె ప్లేస్ లో కుకట్పల్లి జోనల్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి అభిలాష్ అభినవ్ ని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మమత తో పాటుగా శేర్లింగపల్లి జోనల్ కమిషనర్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు