విజయ్: తాను నాకు బ్రదర్ లాంటి వాడు! అందుకే.!

-

తమిళ హీరో శివకార్తికేయన్, ‘జాతిరత్నాలు’ డైరెక్టర్ అనుదీప్  దర్శకత్వంలో వస్తోన్న సినిమా “ప్రిన్స్ ” . ఈ సినిమా దీపావళి కానుకగా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు స్టార్ హీరో విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.

ఈ ప్రమోషన్లో విజయ్ అనుదీప్ గురించి మాట్లాడుతూ నాగ్ అశ్విన్ కు అనుదీప్ కు మంచి స్నేహం కుదిరింది అని ,అతని జోక్స్ కు అశ్విన్ విపరీతంగా లైక్ చేసే వాడని చెప్పాడు. అలాగే ఇద్దరూ మంచి అవగాహనతో జాతి రత్నాలు తీసి హిట్ కొట్టారని, అలాగే ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ట్రైలర్ కూడా బాగా కట్ చేశారని నాకు బాగా నచ్చింది అని చెప్పుకొచ్చారు.

అలాగే శివకార్తికేయన్ గురించి మాట్లాడుతూ.. అతని తో డైరక్ట్ పరిచయం లేదని ఈ రోజే కలిశా అని అన్నారు.తాను చాలా కష్టపడి పని చేసే మనిషి అని సినిమా లో అన్ని శాఖల గురించి మంచి అవగాహన వుందని అన్నాడు. అలాగే తాను ముందు టీవీ పరిశ్రమ లో పనిచేసి, అక్కడ సక్సెస్ అయ్యి తర్వాత సినిమా ఫీల్డ్ లో అడుగు పెట్టారని చెప్పారు. తన అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించాయి అని చెప్పుకొచ్చారు. అయితే ఒక్క సారి మాత్రం  ఒక వేదికపై మాట్లడుతూ ఏడవడం జరిగింది. అది చూసి నాకు బాధ వేసింది సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎలా కష్టపడి , ఎన్నో బాధలు దిగమింగి వస్తారని తెలుసుకున్నాను. ఆరోజు నుండి అతన్ని నా బ్రదెర్ లాగా అనుకున్నా, అందుకే ఫంక్షన్ కు అడగగానే వెంటనే ఒప్పుకున్నాను అని విజయ్ చెప్పుకొచ్చారు.ఈ సినిమా హిట్ కావాలని మనసారా కోరుకుంటున్నాను అని అన్నారు

 

Read more RELATED
Recommended to you

Exit mobile version