మునుగోడుకు నాలుగేండ్లు ఏం చేసినవ్ రాజా : మంత్రి హరీశ్ రావు

-

మునుగోడుకు నాలుగేళ్ల నుంచి రాజగోపాల్ రెడ్డి ఏం చేశారని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. మద్యం, డబ్బుతో గెలుస్తామంటున్న బీజేపీ నేతలకు మునుగోడు ప్రజలు బుద్ధిచెబుతారని అన్నారు. రాజగోపాల్‌ రెడ్డి స్వార్థం కోసమే ఉపఎన్నిక వచ్చిందని చెప్పారు. కోమటిరెడ్డి మళ్లీ గెలిస్తే ఏం లాభమని, టీఆర్‌ఎస్‌ను తిట్టడం తప్ప చేసేదేంలేదని మండిపడ్డారు.

ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఉదయం మర్రిగూడెం మండలం రాజుపేట గ్రామస్థులతో మంత్రి హరీశ్‌ రావు సమావేశమయ్యారు. వారితో కలిసి టిఫిన్‌ చేశారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలన్న గిరిజన సోదరుల డిమాండ్‌ను నాడు అధికారంలో ఉన్న టీడీపీ, కాంగ్రెస్‌లు పట్టించుకోలేదని చెప్పారు. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారని అన్నారు. దీంతో మొత్తం 3,146 మంది సర్పంచులు అయ్యారని గుర్తు చేశారు.

గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజగోపాల్ రెడ్డి ఈ నాలుగేళ్లలో ఒక్కసారైనా గ్రామానికి వచ్చారా అని హరీశ్ రావు ప్రశ్నించారు. కనపడని మనిషి రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకంటారా లేక అభివృద్ధి చేసే టీఆర్ఎస్‌ని గెలిపిస్తారా అని అడిగారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version