ఆలీతో సరదాగా కార్యక్రమం ప్రతివారం ఈటీవీలో ప్రసారమవుతుంది.. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులు విచ్చేయగా తాజాగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్న ఈయన.. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారితో జరిగిన ఒక విషయాన్ని పంచుకున్నారు..
మణిశర్మ బాణీలు సంగీత ప్రియల్ని ఉర్రూతలూగిస్తాయి.. సంగీతమే సామ్రాజ్యంగా బతికిన ఆయన చేతిలో స్వరాలు సరిగమలై పలకరిస్తాయి. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్లను అందుకొని సంగీత ప్రపంచంలో తనకంటూ ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు మణిశర్మ.. అయితే తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన మణి శర్మ.. ఎస్పీ బాలసుబ్రమణ్యం తో తనకున్న అనుబంధాన్ని తెలిపారు..
“మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చూడాలని ఉంది సినిమాలో ఎస్పీ బాలు గారు చాలా పాటలు పాడారు.. అయితే ఇందులో రామ్మా చిలకమ్మ పాటను ఉదిత్ నారాయణతో పాడించాను. నాకు ఎప్పుడూ నా మనసు చెప్పిన మాట వినటమే అలవాటు.. అది కాదని ఏ రోజు ముందుకు వెళ్ళను. అలాగే ఈ పాట ఉదిత్ నారాయణతో పాటిస్తే మంచి హిట్ అవుతుందని బలంగా నమ్మాను. అలా పాడించి మెగాస్టార్ చిరంజీవి గారికి వినిపిస్తే ఆయన నచ్చలేదు అన్నారు. తర్వాత ఒకరోజు మొత్తం షూటింగ్ ఆపేసి మళ్ళీ బాలు గారితో ఇదే పాటను పాటించాం. అయితే రెండిట్లో ఏ పాటను సినిమాలో పెట్టాలి అనే విషయంపై చర్చ జరగగా ఓటింగ్ నిర్వహించారు. దీంట్లో ఉదిత్ నారాయణ గారు గెలిచారు. అయితే ఇందులో మిగిలిన మూడు పాటలు ఎస్పీ బాలు గారు పాడారు. అలాగే నేను బాలు గారు సొంత అన్నదమ్ముల ఉండేవాళ్ళం.. ఆయన నన్ను ఒరే అని పిలుస్తూ ఉండేవారు..” అని తెలిపారు మణి శర్మ..