ప్రతినెల నా అకౌంట్ లో డబ్బులు వేసి ఆదుకుంటున్నాడు ఆ డైరెక్టర్.. రమాప్రభ

-

తెలుగు, తమిళ చిత్రాలల్లో సుమారు 1400కు పైగా సినిమాలలో నటించిన తొలితరం హాస్య నటీమణీ రమాప్రభ.. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగి హీరోయిన్లతో సమానంగా ఆస్తులను కూడబెట్టిన ఈమె తర్వాత తన ఆస్తులన్నీ పోగొట్టుకుంది.. అయితే ఇలాంటి కష్ట సమయంలో తనను ఓ దర్శకుడు ఆదుకుంటున్నాడని.. ప్రతి నెల తప్పకుండా తన అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడని చెప్పుకొచ్చింది..

సినీ ప్రపంచం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ఆ తీరును కొందరు నటీనటులు అర్థం చేసుకుంటే మరికొందరు మాత్రం సంపాదించినదంతా పోగొట్టుకొని ఏమీ లేకుండా మిగిలిపోయారు అలాంటి వారిలో ఒకరే మన హాస్యనటిమని రమాప్రభ.. 1966 నుండి 2015 వరకు నిర్విరామంగా సినిమాలలో నటించి.. మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె 2015లో వచ్చిన బెంగాల్ టైగర్ సినిమా వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించింది ముఖ్యంగా మన పాత తరం హీరోల నుంచి నేటి తరం వరకు అందరితో కలిసి నటించిన రమాప్రభ కొంచెం జాగ్రత్త పడి ఉంటే ఇప్పటికీ కోట్ల ఆస్తిని వెనకేసుకొనే ఉండేది అయితే తన జీవితంలో ఒక వ్యక్తిని నమ్మి తన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నానని.. నమ్మించి తన ఆస్తిని మొత్తం అతని పేరు మీద రాసేసుకున్నాడని.. ఈరోజు ఏమి లేని స్థితిలో ఉన్నానని చెప్పుకొచ్చింది.. అయితే ఇలాంటి దిక్కుతోచని స్థితిలో ఉన్న తనకు స్టార్ డైరెక్టర్ ఆదుకుంటున్నాడని తెలిపింది..

తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం ఇష్టం లేకుండానే ఒక విషయాన్ని మీడియాకు తెలిపింది రమాప్రభ.. “నేను నా జీవితంలో ఎవరికైనా రుణపడి ఉంటాను అంటే అతను డైరెక్టర్ పూరి జగన్నాథ్.. బద్రి సినిమా నుంచి దర్శకుడు పూరీ బాబుతో అనుబంధం ఉంది. ఇది జన్మజన్మల బంధంగా భావిస్తుంటాను. ఆ బాబానే నాకు ఈ బంధం ఏర్పరిచారని అనుకుంటాను.. ఒకరోజు అతను నీ పుట్టినరోజు ఎప్పుడు అని నన్ను అడక్క 5 అని చెప్పాను.. దాంతో ప్రతి నెల ఐదో తారీకు లోగా మీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి అని చెప్పి అప్పటినుంచి ఈరోజు వరకు నాకు డబ్బులు పంపిస్తూనే ఉన్నాడు నా అనుకున్న అందరూ నన్ను మోసం చేసి వెళ్ళిపోతే ఎలాంటి సంబంధం లేని అతను నా కోసం ఇంతలా ఆలోచించి సాయం చేస్తున్నాడు ఓకేనా ఒక పరిస్థితిలో నా అకౌంట్ లో ఎవరు డబ్బులు వేస్తున్నారు కూడా నాకు తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది తర్వాత తెలుసుకుని అతనికి కృతజ్ఞతలు తెలపాలనిపించింది..” అని చెప్పుకొచ్చింది..

Read more RELATED
Recommended to you

Exit mobile version