ఆ జైలు బ్యాడ్జీ నాకు జీవితాంతం ఆరాధనీయం : కేటీఆర్

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతంలో ఆయన వరంగల్ జైలుకు వెళ్లగా అప్పుడు జైలు అధికారులు ఇచ్చిన బ్యాడ్జీని ‘ఎక్స్’ వేదికగా షేర్ చేస్తూ స్పందించారు. ‘జైలుకెళ్లిన ఆ రోజు.. జైలు జీవితాన్ని గుర్తు చేసే ఆ బ్యాడ్జీ జీవితాంతం నాకు ఆరాధనీయం.తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా 15ఏళ్ల క్రితం ఇదే రోజు నన్ను అరెస్టు చేసి వరంగల్ సెంట్రల్ జైలులో ఉంచారు.

జైలులో నా గుర్తింపునకు చెందిన కార్డు తనకు బ్యాడ్జ్ ఆఫ్ హానర్ అని, నా జీవితాంతం నేను ఆరాధించేదని జైలులో ఆనాటి తన గుర్తింపు కార్డును ‘ఎక్స్’లో కేటీఆర్ పంచుకున్నారు. రాష్ట్ర సాధన కోసం జైలు కెళ్లడం గర్వకారణమని కేటీఆర్ ట్వీట్ చేశారు.ఇదిలాఉండగా, కేటీఆర్ రాజకీయ ప్రత్యర్థులు మాత్రం కేటీఆర్‌కు జైలు భయం పట్టుకుందని, అందుకే తనకు జైలు కొత్త కాదని గత స్మృతులను నెమరేసుకుంటున్నారని సెటైర్లు వేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news