ఎన్టీఆర్ కు అత్తగా ఆ స్టార్ హీరోయిన్..!!

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఎన్టీఆర్ 30వ సినిమా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో మొదలు పెట్టాల్సి ఉండగా కథలోని మార్పులు చేర్పులు చేయడంతో ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని కూడా రూ.200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్తాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తున్నారు చిత్ర బృందం. అయితే ఈ సినిమాలోని ఒక ముఖ్యమైన పాత్రకు అలనాటి హీరోయిన్ ని తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి చూద్దాం.అలనాటి హీరోయిన్ విజయశాంతి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇక ఆమె ఎన్నో సినిమాలలో అద్భుతమైన నటనను ప్రదర్శించి స్టార్ హీరోయిన్ రేంజిలో అందుకుందని చెప్పవచ్చు. ఇక 16 సంవత్సరాల తర్వాత మహేష్ బాబు నటించిన సరిలేరు నీకు ఎవరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది విజయశాంతి. అయితే ఆ తర్వాత మరే సినిమాలో కూడా నటించలేదు ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ నటించబోతున్న 30వ సినిమాలో విజయశాంతి అత్త పాత్రలో నటించబోతోంది అన్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.ఇక గతంలో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇక ఆచార్య డిజాస్టర్ కావడంతో.. కొరటాల శివ ఈ సినిమా పైన పలు జాగ్రత్తలు తీసుకొని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి నటీనటుల వివరాలను అధికారికంగా ప్రకటన వెలుబడునుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version