ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఒకపక్క సంక్షేమాన్ని మరోపక్క అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశంలోనే ఎక్కడా కూడా అమలు కావడం లేదని చాలా మంది జాతీయ నాయకులు జగన్ పరిపాలన ఉద్దేశించి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే సమయంలో దేశంలో కూడా మంచి పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి బ్యాంకులలో మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు జగన్.
దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలా చోట్ల జగన్ పరిపాలన పట్ల జనాలు చాలా సానుకూలంగా ఉన్నారు. ఇదే విషయం ఇటీవల జగన్ తన పరిపాలన గురించి చేయించుకున్న సర్వేలో తేలినట్లు రావడంతో వైసీపీలో ఫుల్ హ్యాపీ వాతావరణం నెలకొన్న ట్లు సమాచారం. కాగా పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ పార్టీ నాయకుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా జరిపిన సర్వేలో తేలినట్లు జగన్ దృష్టికి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి.
విషయంలోకి వెళితే వైసీపీ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఒక వృద్ధ మంత్రి వైసిపి పార్టీ నాయకుల మధ్య గొడవలు క్రియేట్ చేసేలా వ్యవహరిస్తున్నారని ఇదే సమయంలో జిల్లాలో మరో మంత్రి కూడా ఎవరిని కలుపుకోకుండా వ్యవహరిస్తున్నారని వార్తలు వచ్చాయి. దీంతో ఇద్దరి నేతల పనితీరుపై జగన్ రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు సూచించారట. ఏ మాత్రం రిపోర్టులో తేడా అన్ని రిజల్ట్ వస్తే వాళ్ళిద్దరి మంత్రి పదవులు ఉడ గొట్టడానికి జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. వీళ్లిద్దరి నాయకుల వల్ల పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీ పార్టీ నాయకుల మధ్య భయంకరమైన విభేదాలు లోలోపల జరుగుతున్నట్లు పార్టీకి బ్యాడ్ నేమ్ వచ్చేటట్లు ఉండటంతో జగన్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.