మంత్రి కేటీఆర్ కి జనసేనాని జన్మదిన శుభాకాంక్షలు

-

తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా ఎందరో ఆయనకి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. అలాగే రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్‌, మంత్రి హరీష్‌ రావు, టాలీవుడ్‌ హీరోలు చిరంజీవి, రామ్‌ చరణ్‌ ఇలా ఎందరో తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

“శ్రీ కేటీఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, తెలంగాణ మునిసిపల్, ఐటీ శాఖల మంత్రి, సహృదయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కాలికి తగిలిన గాయం వల్ల శ్రీ కేటీఆర్ గారి ప్రజా సేవకు కొంత అంతరాయం కలిగిందని తెలిసింది. గాయం నుంచి కోలుకొని యధావిధిగా ఆయన ప్రజాసేవలో మమేకం కావాలని ఆకాంక్షిస్తున్నాను. శ్రీ కేటీఆర్ గారికి దీర్ఘాయుష్, ఆనందకరమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను”. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

https://m.facebook.com/story.php?story_fbid=pfbid02DTQj74ST9rJsUffRvMCSShbk8L62qv6uZMAagBAAw8tjEQbZvzrmwGQJqQdKxDSwl&id=100044434506290

Read more RELATED
Recommended to you

Exit mobile version