అందుకే ఈ హీరోలు లైగర్ మూవీ ని రిజెక్ట్ చేశారా..?

-

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో.. ప్రముఖ హీరోయిన్ ఛార్మీ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం లైగర్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా.. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను వదలగా మిశ్రమ స్పందన లభిస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఈ సినిమాకు ఊహించని స్థాయిలో ప్రమోషన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే.. యంగ్ హీరో విజయ్ దేవరకొండ స్థాయికి మించి ఈ సినిమా కోసం ఏకంగా రూ.160 కోట్ల రూపాయల బడ్జెట్ ఖర్చు చేశారనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారనే వార్త కూడా బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

ముఖ్యంగా అందులో అల్లు అర్జున్, ఎన్టీఆర్ పేర్లు ప్రధమంగా వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ విషయానికి వస్తే.. అల్లు అర్జున్ తో పూరి జగన్నాథ్ దేశముదురు, ఇద్దరమ్మాయిలతో సినిమాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే. దేశముదురు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే.. ఇద్దరమ్మాయిలతో సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఒకవేళ ఇద్దరమ్మాయిలతో సినిమా సక్సెస్ సాధించి ఉంటే లైగర్ సినిమా కథలో బన్నీ నటించేవారేమో కానీ.. ఆ సినిమా డిజాస్టర్ గా మారడంతో మరి ఈ కాంబినేషన్లో లైగర్ సినిమా రాలేదని చెప్పాలి.

ఇక తర్వాత పూరీ జగన్నాథ్ NTR కు ఈ సినిమా కథ వినిపించారు. కానీ ఎన్టీఆర్ నుంచి పూరీ జగన్నాథ్ కు ఎలాంటి రెస్పాన్స్ రాలేదనే సమాచారం కూడా అందుతుంది. ఇక పూరీ జగన్నాథ్ ఎన్టీఆర్ కి , అల్లు అర్జున్ కథ చెప్పిన సమయంలో హీరోకు , హీరోయిన్ కు నత్తి ఉంటుందని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం కథలో పూరి జగన్నాథ్ మార్పులు చేశారా? లేక అదే కథ ఉంచారా?అనే విషయం సినిమా విడుదలయితే తప్ప తెలియదు. ఇక పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్న ఈ సినిమాపై చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని చెప్పాలి. మరి ఆగస్టు 25వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version