అల్లు అర్జున్ ‘పుష్ప’ సీక్వెల్‌పై ఫహద్ ఫాజిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో అయితే ఈ పిక్చర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఈ ఫిల్మ్ చూసి ఎంజాయ్ చేశారు. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఫిదా అయిపోయారు.

ఈ మూవీలో ప్రతి కథానాయకుడిగా కీలక పాత్ర పోషించిన మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘పుష్ప’ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను ఈ సినిమా గురించి సంప్రదించినప్పుడు ఒకే ఒక పార్ట్ గా సినిమా ఉంటుందని దర్శకుడు సుకుమార్ చెప్పారని గుర్తు చేసుకున్నాడు. అయితే, డైరెక్టర్ సుకుమార్ వద్ద ‘పుష్ప’ పార్ట్-3 కి కూడా సరిపోయేంత స్క్రిప్ట్ ఉందని ఫహద్ చెప్పుకొచ్చాడు. దాంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సుకుమార్-బన్నీ కాంబోలో వస్తున్న ‘పుష్ప-2’ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో అప్పుడే ‘పుష్ప-3’ గురించి ఈ రకమైన కామెంట్స్ చేయడం ప్రజెంట్ ఫిల్మ్ నగర్ సర్కి్ల్స్ లో హాట్ టాపిక్ అయింది.

ఇకపోతే ‘పుష్ప-2’లో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ భాజ్‌పాయిని తీసుకోవాలని సుకుమార్ భావిస్తున్నారని తెలుస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ పిక్చర్ లో హీరోయిన్ క్యూట్ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది. ఫహద్ ఫాజిల్ ‘భన్వర్ సింగ్ షెకావత్’ అనే పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version