జమ్ముకాశ్మీర్‌లోని పహెల్గాం జిల్లాలో జరిగిన ఉగ్రదాడి దేశప్రజలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 26 మంది మరణించగా..అందులో మరో ఇద్దరు విదేశీ పర్యాటకులు సైతం ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ మీద భారత ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశించింది.
ఆ దేశానికి సింధు జలాలను నిలిపివేసింది. పాక్ పౌరులకు వీసాలను సైతం రద్దు చేసింది. పాక్ పౌరులు దేశాన్ని వీడాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే కాశ్మీర్ ఉగ్రదాడి మీద పాక్ మాజీ క్రికెటర్ షాహీద్ అఫ్రిదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘100% భారత్ సైన్యం ఫెయిల్యూర్.. చేతకాని తనం వల్లే ఉగ్రదాడి జరిగింది. మేము దాడులు చేస్తే.. మీ భారత కబడ్డీ జట్టు మా పాకిస్తాన్‌కు వచ్చి ఎలా ఆటలు ఆడుతుంది?’ అని ఆయన ప్రశ్నించారు.