మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బీజేపీ మీద చేసిన ఆరోపణలు అన్ని అవాస్తవాలే అని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. గత పదేళ్లలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణకు ప్రధాని మోడీ రూ.10 లక్షల కోట్లు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు.
ఈ సందర్బంగా ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దురదృష్టం కొద్దీ మా వాళ్ళు కరెక్ట్ లేరు అని సొంత పార్టీ మీద ఆయన విమర్శలు గుప్పించారు. సొంత పార్టీ పెద్దలు సరిగా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేది అని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఇదిలాఉండగా, రాజాసింగ్ ఇటీవల సొంత పార్టీ నేతల మీదే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. స్టేట్ పెద్దలు గుట్టుగా సీఎం రేవంత్‌తో సమావేశం అవుతున్నారని ఆయన ఇటీవల విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.